Central Govt Jobs

Railway Group D Vacancy 2024-2025: Apply Now

RRB గ్రూప్ D 2025: రైల్వేశాఖ (Railway Group D Vacancy 2024-2025) భారీ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి సన్నాహాలు చేస్తోంది. ఈసారి RRB(Group D) పోస్టుల భర్తీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమలో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (Railway Recruitment Board) మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు సంకేతం ఇచ్చింది. ఈ ప్రకటన ద్వారా దాదాపు 32,438 గ్రూప్‌ డీ (Group D) ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు షార్ట్‌ నోటిఫికేషన్‌ వెల్లడించినున్నట్లు సమాచారం.

    తాజా నోటిఫికేషన్‌ బట్టి చూస్తే డిసెంబర్‌ 28న ఈ ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 32,438 ఖాళీల కోసం GROUP D రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేయనుంది.RRB గ్రూప్ D 2025 ఉద్యోగాలు వివిధ రైల్వే విభాగాల్లో నాన్-టెక్నికల్ రోల్స్‌కి సంబంధించినవి. రోల్స్‌లో ట్రాక్ మెయింటెనర్, హెల్పర్, పోర్టర్, మరియు ఇతర సాంకేతిక, నాన్-టెక్నికల్ పోస్టులు ఉన్నాయి.పదో తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ RRB Group D పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ 2025 జనవరి 23వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. ఫిబ్రవరి 22 దరఖాస్తులకు చివరితేది. పోస్టుల వారీ ఖాళీలు, విద్యార్హత, ఎంపిక విధానం, సిలబస్‌ తదితర వివరాలను ఆర్‌ఆర్‌బీ త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. అభ్యర్థులు పూర్తి వివరాలకు.

పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండి.. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి పోస్టులు ఉన్నాయి.

RRB గ్రూప్ D 2025 ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు వైద్య పరీక్షలు ఉన్నాయి.

  • శాలరీ:
    • నెలకు ₹18,000 – ₹56,900 మధ్య.
  • పరీక్షా ఫీజు:
    • RRB గ్రూప్ D 2024 దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు ఫీజు ₹500 (సాధారణ అభ్యర్థులకు) మరియు ₹250 (PwBD, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మాజీ సైనికులు, SC, ST, మైనార్టీ కమ్యూనిటీలకు). దరఖాస్తు ఫారం సరిచేసే అవకాశం కూడా ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియలో అడుగు-చూడాల్సిన ప్రక్రియలు:
      • రిజిస్ట్రేషన్
      • OTP ద్వారా ఇమెయిల్ మరియు మొబైల్ నంబర్ ధృవీకరణ
      • దరఖాస్తు ఫారం నింపడం
      • ఫీజు చెల్లింపు
      • ఇతర వివరాలు.
  • దరఖాస్తు విధానం : 
    • ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
    • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: జనవరి 23, 2025
    • ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2025
  • పరీక్షా తేదీ:
    • 2025లో పరీక్షలు నిర్వహించబడతాయి.
  • Age Limit
    • 01.07.2025 నాటికి 18 నుంచి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్‌ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
  • ఆర్‌ఆర్‌బీ రీజియన్లు
    • అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పుర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్ తదితర రీజియన్లలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

Click here to apply for this Job.

Leave a Reply

Translate »